తెలంగాణ

జేఏయూతో కలిసి పనిచేయనున్న ఫ్లోరిడా విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: వ్యవసాయంలో సర్ట్ఫికెట్ కోర్సులు, ఆన్‌లైన్ కోర్సులు, సంయుక్త డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందించడం వంటి పలు అంశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆసక్తి కనబరిచింది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఉపకులపతి ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్‌తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంలో విశ్వవిద్యాలయంలో గుర్తించిన కొంత మంది అధ్యాపకులకు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని ఉపకులపతి ప్రవీణ్‌రావు కోరారు. అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పరిశోధనలపై శిక్షణ కల్పించేందుకు తోడ్పాటునందించాలన్నారు. ఇందుకు సంబంధించిన వ్యయంతో పాటు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అందించే సహకారం వంటి అంశాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. సర్ట్ఫికెట్ కోర్సులు, సంయుక్త డిగ్రీలు అందించే అంశంపై చర్చించారు. ఇరు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఆన్‌లైన్‌లో సర్ట్ఫికెట్ కోర్సులతో పాటు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంకు చెందిన ఫ్యాకల్టీ ఇక్కడకు వచ్చి కోర్సులు నిర్వహించడం వంటి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు రమేష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల గురించి ఆయా డీన్లు, డైరెక్టర్లు వివరించారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు డి. రాజిరెడ్డి, ఎస్. డాండి, ఆర్. జగదీశ్వర్, వీరాంజనేయులు, సదాశివరావు మీనాకుమారి, విస్ణువర్ధన్‌రెడ్డి, అంతర్జాతీయ వ్యవహారాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కే. జీవన్‌రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.