తెలంగాణ

జీఎస్‌టీ పరిధిలోకి వినోదపు పన్ను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఇంతకాలం సినిమా థియేటర్ల నుంచి వస్తున్న వినోదపుపన్ను వస్తుసేవా పన్ను అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం ఖాతాలోకి మళ్లుతోంది. దీని వల్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ. 100 కోట్ల ఆదాయానికి గండి పడింది. 2017-18 సంవత్సరానికి వినోదపు పన్ను మున్సిపాలిటీల ఖాతాలోకి జమ కాలేదు.
అంతంత మాత్రంగానే ఉన్న మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి దీంతో మరింత దిగజారినట్లయింది. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి వస్తు సేవా పన్నును జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలులోకి తెచ్చిన సంగతి విదితమే. రాష్ట్రంలో అతి పెద్ద నగర పాలక సంస్థ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు సాలీనా రూ. 70 కోట్లు, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 10 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల ఆదాయం వినోదపు పన్ను ద్వారా వస్తోంది. రాష్ట్రంలో 460 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇందులో 368 థియేటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. గతంలో మున్సిపాలిటీలకు వినోదపు పన్ను ఆదాయం ట్రెజరీల ద్వారా అందేది. ఈ నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీలు ఖర్చుపెట్టేవి. ప్రస్తుతం వినోదపు పన్ను ఆదాయం కేంద్ర ఖాతాలో జమచేస్తున్నారు. త్వరలో కేంద్రం తమ ఖాతాలో చేరిన వినోదపు పన్ను ఆదాయాన్ని వివిధ రాష్ట్రాలకు కేటాయించనుంది. ఇది సంక్లిష్టమైన నిర్ణయమని, ఏ రాష్ట్రానికి ఎంత వస్తుందో అనే దానిపై ఒక ఫార్ములాను కేంద్రం ఖరారు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనేక దశలు దాటి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంటుంది.
అనంతరం రాష్ట్రం ఆయా మున్సిపాలిటీలకు నిధులను కేటాయిస్తుంది. జిఎస్‌టి వల్ల తమకు వస్తున్న వినోదపు పన్ను కేంద్ర ఖాతాలో చేరుతోందని, వీలైనంత త్వరలో ఈ నిధులను మున్సిపాలిటీలకు కేటాయించే విధంగా చర్యలుతీసుకోవాలని వివిధ మున్సిపాలిటీల పాలక వర్గాలు రాష్ట్ర మంత్రి కెటి రామారావును కోరాయి.