తెలంగాణ

వాస్తవ సాగుదారులందరికీ పెట్టుబడి సహాయం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగు చేస్తున్న వారికే పెట్టుబడి సహాయం అందేలా చూడాలని పలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూం భవన్‌లో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడారు. పట్టా రైతుకే ఎకరానికి రూ.4వేలు ఇస్తామని చెప్పడం సమంజసం కాదని, అనేక ఏళ్లుగా కౌలు చేస్తున్న రైతులకు కూడా పథకం వర్తింపచేసి ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలి డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా కౌలు, పోడు రైతులు లక్షల సంఖ్యలో వ్యవసాయం చేసుకుంటున్నారని, 40శాతం మంది కౌలు రైతులు భూమినే నమ్ముకొని పనిచేస్తున్నారని చెప్పారు. కౌలు రైతులే అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే ప్రభుత్వం పేర్కొందని ఆమె గుర్తుచేశారు. కౌలు రైతులకు సహాయం అందించమని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య అని అన్నారు. కౌలు రైతుల సమస్యలపై ఈనెల 17న సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పంటల పెట్టుబడి కింద ప్రజల సొమ్మునే ఇస్తున్నారని ఆది కేసీఆర్ సొమ్ముకాదని రైతు స్వరాజ్య వేదిక నాయకులు కిరణ్ పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ భూములను నమ్ముకొని వేలాది మంది సేద్యం చేస్తున్నారని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో చంద్రారెడ్డి, కోటేశ్వరరావు, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.