తెలంగాణ

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఓటర్ల జాబితా నుంచి వేల సంఖ్యలో పేర్లు తొలగించడంపై కాంగ్రెస్ నేత లు ఆందోళన వ్యక్తం చేశారు. టి.పిసిసి ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు బి. కమలాకర్ రావు, జి. నిరంజన్, శ్యాం మోహన్, వినోద్‌రెడ్డి, ప్రేమలత, నరేందర్ రావు, రాజేశ్వర్ శుక్రవారం తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిథిలో భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించారని వారు ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని వారు కోరారు.