తెలంగాణ

పాత పెన్షన్ అమలు చేసే వారికే ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తామని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ప్రతినబూనారు. ఆదివారం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్సనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయాస్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 103 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. వేలాదిగా తరలి వచ్చిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసి పోయింది. యూనియన్ అధ్యక్షుడు స్థితిప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. సీపీ ఎస్ విధానం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతోనే కేంద్రం అమలు చేస్తుందని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రానికి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతి ఉద్యోగి పెన్షన్ తీసుకోవడం హక్కు అని చెప్పిందని అన్నారు. మార్కెట్ ఆధారంగా పెన్షన్ వస్తుందని సీపీఎస్‌లో ఉందన్న విషయం రాష్ట్రానికి తెలియదా అని నిలదీశారు. ఈ విధానం వల్ల ఏళ్ల తరబడి ప్రభుత్వం పనిచేసిన వారు చివరి దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పెడతామంటున్న సీఎం కేసీఆర్ థర్ట్ ఫ్రంట్‌లో సీపీఎస్ రద్దు ఉంటుందా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని లక్షా, 32వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ మెస్సేజ్‌లు పంపాలని సూచించారు. ఫ్రండ్లీ ప్రభుత్వం, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నెంబర్ అంటున్న రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ను ఎందుకు తీసుకురావడం లేదని యూనియన్ అధ్యక్షుడు స్థితిప్రజ్ఞ ప్రశ్నించారు. సీపీఎస్ విధానంతో ఇప్పటికే 262 మంది మృతిచెందారని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఆగస్టు 23లోపు స్పష్టత ఇవ్వక పోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అనంతరం ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులతో పాత పెన్షన్ అమలు చేసే వారికే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జన జాతర సభ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారిని ప్రత్యేకంగా తనిఖీలు చేసిన అనంతరమే లోనికి అనుమతించారు.

చిత్రాలు...తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయాస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో నేతల అభివాదం