తెలంగాణ

ప్రమాద రహిత తెలంగాణగా మారుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా మారుద్దామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. సోమవారం నాడిక్కడ శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్‌లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 25 నుంచి 35 ఏళ్ల యువతే చనిపోతున్నందున, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని కోరారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.56 లక్షల మంది మృత్యువాత పడుతుండగా, రాష్ట్రంలో 20 వేల ప్రమాదాల్లో ఏడు వేల మంది మృతి చెందుతున్నారని అన్నారు. 2020 నాటికి 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గిద్దామని పిలుపునిచ్చారు.