తెలంగాణ

టిఎస్-సెట్ సర్ట్ఫికెట్ల పరిశీలన గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: టిఎస్ సెట్‌లో అర్హులైన వారు తమ సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఈ నెల 20వ తేదీ వరకూ ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం ప్రాంగణంలో ఉన్న టిఎస్‌సెట్ కార్యాలయంలో హాజరుకావచ్చని మెంబర్ కార్యదర్శి ప్రొఫెసర్ బిరుదురాజు యాదవరాజు తెలిపారు. సర్ట్ఫికేట్ల జిరాక్స్‌లు, రెండు ఫోటోలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
ఏబీవీపీ ధర్నా
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గచ్చీబౌలీలోని నిథమ్‌వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతూ, విద్యార్థులపైనే తిరిగి పోలీసు కేసులు పెట్టిస్తున్న డైరెక్టర్ చిన్నంరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. వివిధ పరిణామాల తర్వాత డైరెక్టర్ చిన్నంరెడ్డి వచ్చి విద్యార్థులకు క్షమాపణలు చెప్పడంతో కార్యకర్తలు ధర్నా విరమించారు.