తెలంగాణ

విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ‘స్టడీ ఇన్ ఇండియా’ పోర్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న 150 విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు చేరేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకాలం ఆయా విశ్వవిద్యాలయాల్లోని విదేశీ విభాగాలే స్వయంగా పూనుకుని ఇతర దేశాలు, ఖండాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు, ఆయా విశ్వవిద్యాలయాల ప్రచారాన్ని చేపట్టేందుకు ప్రయత్నించేవారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లలో సమస్యలు తలెత్తేవి. అలాగే వారి ఫీజుల చెల్లింపు, వారి కోసం ప్రత్యేక హాస్టళ్ల ఏర్పాటు, భద్రత వంటి అంశాలతో కొత్త తలనొప్పులు ఎందుకనుకున్న యూనివర్శిటీలు దేశీయ విద్యార్థులతో సరిపెట్టుకునేవి. కాని విదేశీ విద్యార్థులకు భారతీయ వర్శిటీల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడం, కోర్సులు, ఫీజులు, నివాసం, సౌకర్యాలు, ఆయా ప్రాంతాల్లోని సమకాలీన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, రవాణా సదుపాయాలు, భాషలు, టెలి కమ్యూనికేషన్ సదుపాయాలు వంటి సమగ్ర సమాచారాన్ని ఆసక్తి ఉన్న విద్యార్థులకు నేరుగా అందించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్టడీ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ను బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభిస్తారు. దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల విద్యార్థులకు ఈ సమాచారాన్ని అందిస్తారు. నేక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ రేటింగ్ ఉన్న 150 వర్శిటీల సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతారు. ఆ సమాచారం ప్రాతిపదికగా అడ్మిషన్లు పొందే వీలుంటుంది. ఈ సమగ్ర సమాచారాన్ని డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ స్టడీ ఇండియా డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు.