తెలంగాణ

జాతీయ రహదారుల నిర్మాణానికి నెలాఖరులోగా భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణను ఈ నెలఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ఖిశ డాక్టర్ ఎస్‌కే. జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జాతీయ రహదారులకు భూసేకరణతో పాటు హరితహారం, సివిల్ సర్వీసెస్ డే, భూరికార్డుల నవీకరణ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యక్రమాలు, గ్రామస్వరాజ్ అభియాన్, డాష్ బోర్డ్, 2021 సెన్సస్ డేటా సేకరణకు ముందస్తు చర్యలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూసేకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందు కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్‌కు సంబంధించి రైతుల ఆధార్ సీడింగ్‌ను తహసీల్దార్లు తమ డిజిటల్ సిగ్నేచర్‌లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే ముద్రించిన రూ.20లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామని, మరోమారు రికార్డులను సరిచూసుకొని, ఏమైనా తేడాలుంటే పంపాలని సీఎస్ తెలిపారు. రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, ధరణి వైబ్‌సైట్, భూరికార్డుల ఆధునీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని వివరించారు. వక్ఫ్ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ శాఖకు అధిక ప్రాధన్యత ఇచ్చి 2వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల రెసిడెన్షియల్ పాఠశాలలకు 72చోట్ల భూములను గుర్తించాల్సి ఉందని, మరో 10 చోట్ల గుర్తించిన భూములను అప్పగించాల్సి ఉందని అన్నారు. 2021 సెనె్సస్ డాటా సేకరణకు సంబందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ విషయమై జీఏడి ద్వారా ఇప్పటికే డి ఓ లెటర్ రాయడం జరిగిందన్నారు. ఈ ఏడు హరితహారానికి సంబంధించి జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను వెంటనే అప్‌లోడ్ చేయాలని, నర్సరీలకు సంబంధించి ప్లానింగ్ మైటీరియల్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించారు. వేసవిలో మొక్కల సంరక్షణపై దృష్టి సారించి వారికి ఒక్కసారైనా మొక్కలకు నీరు పోసేందుకు జిల్లాలోని అందర్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, మైనారిటీ సంక్షేమ కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, పంచాయితీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్‌లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.