తెలంగాణ

సర్కారుకు చెంప పెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దును హైకోర్టు తీర్పుపై పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎల్‌పీ జానారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను రద్దును హైకోర్టు కొట్టి వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు వంటిదని. ప్రభుత్వ అహంకారంతో, అప్రజాస్వామికంగా వ్యవహారించింది. ఈ తీర్పు దేశానికి మార్గదర్శకం అవుతుంది. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహారిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభా నియామళి సభాపతి పరిథిలో ఉండదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గన్ మెన్లను తొలగించడం ప్రభుత్వ కక్ష పూరితంగా వ్యవహారిస్తుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కేసీఆర్ రాజీనామా చేయాలి: కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యే
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రాజీనామా చేయాలి. గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాలమయంగా ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తే మమ్మల్ని సభ నుంచి గెంటేశారు. నాతో పాటు దళిత ఎమ్మెల్యే సంపత్ శాసనసభ్యత్వాన్నీ రద్దు చేశారు.
ధర్మాన్ని కాపాడింది: సంపత్ కుమార్, ఎమ్మెల్యే
న్యాయ వ్యవస్థ ధర్మాన్ని కాపాడుతుందని హైకోర్టు తీర్పుతో నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం కక్షతో, కుట్ర పూరితంగా వ్యవహారించింది. మేము విజయం సాధించడానికి సహకరించిన ప్రజలకు, మేధావులకు అందరికీ అభినందనలు. మేము విజయం సాధించాలని అన్ని మతాల వారు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేశారు.
తొందరపాటు నిర్ణయం: నాదెండ్ల మనోహర్, మాజీ స్పీకర్, ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్లే హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజే అసెంబ్లీ రూల్స్‌ను సక్రమంగా, జాగ్రత్తగా పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసకునే పరిస్థితి కల్పించినట్లయ్యింది. ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహారించింది.
సభ స్పీకర్ పరిథిలో ఉండదు: ఎస్. రామచందర్ రావు, మాజీ అడ్వకేట్ జనరల్
అసెంబ్లీని ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించేప్పుడు సభ స్పీకర్ పరిథిలో ఉండదు. గవర్నర్ పరిథిలో ఉంటుంది. సదరు సభ్యులకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సభ్యత్వాలను రద్దు చేశారు. సభ్యులకు సంజాయిషీ చెప్పుకునేందుకైనా అవకాశం ఇవ్వలేదు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను.
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సభలో జరిగిన దానికి అతిగా స్పందించి, సంకుచిత ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిరంకుశ చర్యకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. కక్షపూర్తి వైఖరిని విడనాడి ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి వ్యవహరించాలి, లేని పక్షంలో ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు. శాసన సభను మరింత హుందాగా నడిపించాలి. అందరు సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశాన్ని కల్పించాలి.
నోటీసు ఇచ్చి ఉండాల్సింది: పద్మనాభ రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీకి పూర్తి బాధ్యులు స్పీకర్. సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే ముందు వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి విచారించాల్సి ఉంది. తప్పుచేసి ఉంటే సభ్యత్వాన్ని రద్దు చేసి ఉండవచ్చు. అంతే కాని మా ఇష్టం అంటే కుదరదు. అలాగే సభ్యులు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు బాగాలేదు. కాని వీరికి సభ్యత్వాన్ని రద్దు చేసేంత పెద్ద శిక్ష విధించారు. హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా స్వాగతించాలి. కొత్త ఒరవడిని ఉన్నత న్యాయ స్థానం సృష్టించింది. తప్పు ఎక్కడా జరిగినా న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ స్థానాలకు ఉందని హైకోర్టు తీర్పులో పేర్కొనడం మంచి పరిణామం.
ప్రభుత్వానికి సిగ్గు చేటు: డాక్టర్ చెరుకు సుధాకర్,అధ్యక్షుడు, తెలంగాణ ఇంటి పార్టీ
శాసనసభ్యత్వాల రద్దు కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటు. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. 2019 ఎన్నికల్లో నియంతృత్వ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.