తెలంగాణ

19 మార్కెట్ కమిటీల గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని 19 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల గడువును ఆరు నెలల పాటు పొడిగిస్తూ, వేర్వేరుగా జీఓలు జారీ అయ్యాయి. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మంగళవారం ఈ జీఓలు జారీ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్, ఆత్మకూర్ (వరంగల్), ఇచ్చోడ (ఆదిలాబాద్), గోపాల్‌రావుపేట (కరీంనగర్), ఆదిలాబాద్, జైనూర్ (ఆసిఫాబాద్), ధర్మపురి, కల్వకుర్తి, కోదాడ, నిడమనూర్ (సూర్యాపేట), వనపర్తి, ములుగు (్భపాలపల్లి), ఇంద్రవెల్లి (ఆదిలాబాద్), భువనగిరి, కొత్తగూడెం, సదాశివపేట (సంగారెడ్డి), నారాయణపేట (మహబూబ్‌నగర్), ఎనుమాముల (వరంగల్), వర్దన్నపేట (వరంగల్ పట్టణం) మార్కెట్ కమిటీల పాలక మండల్ల గడువును ఈ నెల నుండి మరో ఆరునెలల పాటు పొడించారు.