తెలంగాణ

నా హత్యకు సర్కారు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: శాసన సభ్యత్వ రద్దుపై హైకోర్టు అనుకూ లంగా తీర్పు ఇచ్చిన తర్వాత సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం తొలిసారిగా సొంత నియోజకవర్గ కేంద్రం నల్లగొండకు రాగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నార్కట్‌పల్లి నుండి భారీ వాహన శ్రేణితో, కార్యకర్తల మోటార్ సైకిళ్ల ర్యాలీతో నల్లగొండలో అడుగుపెట్టిన కోమటిరెడ్డికి దారి పొడవునా పూలు చల్లుతూ ఊరేగింపు నిర్వహించారు. వీటీ కాలనీ వద్ద ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి కోమటిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశిం చి మాట్లాడుతు సీఎం కేసీఆర్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక అసెంబ్లీలో రైతుల సమస్యలపై పోరాడుతున్నందుకు, కేసీఆర్ ప్రభు త్వ అరాచాకాలను, వైఫల్యాలను ఎండగడుతున్నందుకే అప్రజాస్వామికంగా తన శాసనసభ సభ్యత్వ రద్దుకు కుట్రచేశాడన్నారు. న్యాయం, దైవం, ప్రజల ఆశీస్సులు తన వైపు ఉండటంతో హైకోర్టు తన శాసన సభ్యత్వాన్ని పునరుద్ధరించిందన్నా రు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తనను అంతమొందించే కుట్ర చేస్తుందని కోమటిరెడ్డి ఆరోపించారు.
మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంల అనుచరులతో తనను చంపిం చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తనవైపు ఉన్నంతకాలం తనను వందమంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజకీయ దీక్ష చేయగా, తాను మంత్రి పదవిని వదిలి తెలంగాణ విద్యార్థుల బలిదానాలకు చలించి రాష్ట్ర సాధన కోసం నిజాయితీగా దీక్ష చేశానన్నారు.

చిత్రం..హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే హోదాలో నల్లగొండకు వచ్చిన కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డికి భారీ ర్యాలీలో ఘనస్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు