తెలంగాణ

27న సింహగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 19: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చి దళితులు, గిరిజనులు గౌరవంగా జీవించే హక్కును హరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారు బాలాజీనగర్‌లోని యల్‌హెచ్‌పియస్ రాష్ట్ర అధ్యక్షుడు కోట్యానాయక్ నివాసంలో గురువారం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి దయాకర్, యల్‌హెచ్‌పియస్ అధ్యక్షుడు కోట్యానాయక్‌లతో కలిసి మంద కృష్ణ విలేఖరులుతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ అట్రాసిటీ చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి దళిత, గిరిజనులకు శాశ్వత భద్రత కల్పించాలని డిమాం డ్ చేస్తూ మే నెల 27న వరంగల్‌లో దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో లక్షలాదిమందితో దళిత, గిరిజన సింహగర్జన మహాసభను నిర్వహిస్తున్నట్టు ఆయ న ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక కేంద్రప్రభుత్వ హస్తం వుందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు కోర్టు చట్టంలోని పదునైన కోరలను తొలగించే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. న్యాయవ్యవస్థలో దళిత, గిరిజన రిజర్వేషన్లు లేకపోవడం వలన చట్టాలను నిర్వీర్యం చేసే నిర్ణయాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో రిజర్వేషన్‌లను ఎత్తివేసేందుకు ముందస్తుగా జరిగిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.
దళిత, గిరిజనులపై కేంద్రానికి చిత్తశుద్ది వుంటే తీర్పు వచ్చిన 48 గంటల్లో రివ్యూ పిటిషన్ వేయకుండా ఉత్తరాదిలో బంద్ నిర్వహించిన తరువాత దళితుల, గిరిజనుల ప్రతిఘటన తీవ్రతను చూసి రివ్యూ పిటిషన్ వేసిందని ఆయన వివరించారు. కేసులు వీగిపోయినంత మాత్రాన చట్టం దుర్వినియోగం అయినట్టు కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి బాలకృష్ణన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసులు వీగిపోతే చట్టం దుర్వినియోగం అయినట్టు భావిస్తే చుండూరు ఉదంతం జరగనట్టా, వరకట్న నిషేధ చట్టాన్ని తొలగిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తో అంబేద్కర్ ఆత్మ ఘోషించి వుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనుగడ కొరకు నిర్వహిస్తు న్న సింహగర్జనకు దళిత, గిరిజనులు తరలిరావాలని మంద కృష్ణ పిలుపునిచ్చారు. రవినాయక్, రాజు, రాము, శైలజ, స్నేహలత, మధు పాల్గొన్నారు.
చిత్రం..కోదాడ శివారు బాలాజీనగర్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న మంద కృష్ణ