తెలంగాణ

ప్రపంచంలోనే యాజమాన్య విద్యకు అగ్రగామి సంస్థ ఎన్‌మిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రపంచంలోనే యాజమాన్య విద్యకు అగ్రగామి సంస్థగా నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ (ఎన్‌మిమ్స్) ఆవిర్భవించిందని ఆ సంస్థ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజన్ సక్సేనా వ్యాఖ్యానించారు. గురువారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 100 శాతం విద్యార్థులకు ఇన్ఫోసిస్, టిసిఎస్, బ్రాడ్‌రిడ్జ్, నోవారిటస్, ఐసిఐసిఐ వంటి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో అవకాశం దక్కిందని అన్నారు. వారికి గరిష్టంగా సంవత్సరానికి 25 లక్షల వరకూ వేతనం దక్కుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కో చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేయడం, నిరంతరం నేర్చుకోవడం, వృత్తి పట్ల నిబద్ధత, పారదర్శకత, లక్ష్యం ఉండాలని సూచించారు.
అటువంటి వారే రాణిస్తారని చెప్పారు. వార్షిక నివేదికను డాక్టర్ బి కరుణాకర్ సమర్పించారు. 94 మంది విద్యార్థులకు అపుడే నెలకు 90 వేల వేతనానికి ఇంటర్న్‌షిప్ లభించిందని వీసీ పేర్కొన్నారు.