తెలంగాణ

మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్‌ల తయారీకి ప్రభుత్వం పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్స్‌ను తయారుచేసేందుకు రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 54 మున్సిపాలిటీలు తెలంగాణ టౌన్ ప్లానింగ్ చట్టం పరిధిలోకి వస్తాయి. మిగిలిన 19 మున్సిపాలిటీలు పట్టణాభివృద్ధి అథారిటీ కిందకు వస్తాయి. కాగా 59 మున్సిపాలిటీల్లో 32 మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ల మంజూరుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. మరో 27 మున్సిపాలిటీలకు సంబంధించి మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో మాస్టర్ ప్లాన్ల తయారీని మెసర్స్ డిడిఎఫ్ కనె్సల్టెంట్, ఢిల్లీకి అప్పగించారు. ఈ విభాగమే యాదగిరి గుట్ట దేవాలయం అభివృద్ధి అధారిటీ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసే పనిని చేపట్టింది. ఇదే సంస్థ వేముల వాడ దేవాలయం అథారిటీ మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేస్తోంది. తెలంగాణలో మొత్తం మండల కేంద్రాలకు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ఇండికేటివ్ ల్యాండ్ యూజ్ ప్లాన్లను తయారు చేయాలని కూడా తెలంగాణ పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ నిర్ణయించింది. కాగా తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు 37 పట్టణ స్థానిక సంస్థలకు జీఐఎస్ బేస్ మ్యాపుల తయారీని చేపట్టింది. ఈ పనిని మెసర్స్ పర్యావరణ అభివృద్ధి కేంద్రానికి అప్పగించారు. ఈ ప్రణాళిక డేటాను ఈ శాఖ పరిశీలిస్తోంది. రెండవ దశలో 22 మున్సిపాలిటీలకు జీఐఎస్ బేస్ మ్యాపులను చేపట్టారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఆర్థిక కమిషన్ కింద మున్సిపాలిటీల్లో ప్రాథమిక అభివృద్ధి నిర్వహణ, వౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ. 755.2 కోట్లను కేటాయించారు. కొత్త మున్సిపాలిటీల్లో రోడ్లు, కాల్వలు, ఆట స్థలాలు, జంక్షన్ అభివృద్ధికి రూ. 50కోట్లను, అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 230.10 కోట్లు కేటాయించారు.