తెలంగాణ

‘రైతుబంధు’ విజయవంతానికి బ్యాంకులు తోడ్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధం’ పథకం విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్లు సహకరించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ (గన్‌ఫౌండ్రీ) లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడుతూ, బ్యాంకులకు సంబంధించిన అన్ని స్థాయిల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. 2018 మే 10 నుండి రైతుబంధు పథకానికి సంబంధించిన చెక్కులను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం చేయాల్సి ఉందన్నారు. పంటల పెట్టుబడి కోసం ఎకరాకు ఒక పంటకు నాలుగువేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామని, ఒక ఏడాదిలో ఖరీఫ్ (వానాకాలం), యాసంగి పంటలకు కలిపి ఎనిమిది వేల రూపాయల సాయం చేస్తున్నామన్నారు. రైతులకు ఈ తరహా సాయం చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
రైతుబంధు పథకం అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో రైతులను ఎలాంటి పరిస్థితిలోనూ, ఏ విధంగానూ ఇబ్బంది పెట్టవద్దని పోచారం కోరారు. చెక్కులను నగదు రూపంలోకి మార్చుకునేందుకు రైతులు బ్యాంకులకు వస్తే సిబ్బంది సహకరించాలని సూచించారు. పంటల పెట్టుబడి కోసం రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బును బ్యాంకు శాఖల్లో అధికారులు, సిబ్బంది బకాయిల పేరుతో రుణాల వసూళ్లకు ముడిపెట్టవద్దన్నారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తం డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేస్తుందని, ఇప్పటికే ఇందుకోసం జీఓ జారీ చేశామని గుర్తు చేశారు.
రైతుల్లో 62 శాతం మంది చిన్న సన్నకారు రైతులేనని తెలిపారు. వీరికి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లపై కూడా ఉందన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో 2017-18 సంవత్సరంలో బ్యాంకులు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయని పోచారం పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులు మంచి ఫలితాలు, ఉత్తమ ఫలితాలు సాధించగా, మరికొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2018-19 సంవత్సరంలో నిర్ణయించిన లక్ష్యాన్ని బ్యాంకర్లు 100 శాతం సాధించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలపై తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్ జే. స్వామినాథన్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యాంకర్లు కూడా ఈ పథకం అమలు చేయడం కోసం జిల్లాస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మంచి, చెడులపై సమీక్షించాలని, ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే, తమకు (ప్రభుత్వానికి) తెలియచేయాలని కోరారు.
చిత్రం..ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి