తెలంగాణ

ఎడ్‌సెట్, పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణలో ఎడ్‌సెట్, పీఈసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. బీఈడీలో చేరేందుకు నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ గడువు పొడిగించారు. 25వ తేదీ తర్వాత 500 జరిమానాతో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి తెలిపారు.
కాగా, పీఈసెట్ దరఖాస్తు గడువును అపరాధ రుసుం లేకుండా 27వ తేదీ వరకూ పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. 500 జరిమానాతో ఏప్రిల్ 30 వరకూ, 2వేల జరిమానాతో మే 2 వరకూ, 5వేల జరిమానాతో మే 4వ తేదీ వరకూ గడువు ఇచ్చినట్టు ఆయన వివరించారు.