తెలంగాణ

మెట్ట రైతులకు వరం ‘ఏరోబిక్ రైస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: నిలువ నీరు, బురద లేకుండా మెట్ట భూముల్లో మొక్కజొన్న పంట లాంటి వరి సాగు పద్ధతిలోని ఏరోబిక్ రైస్ పంట వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఈ పంటపైన పరిశోధనలు చేసిన కిసాన్ క్రాఫ్ట్‌కు చెందిన సుమంతా హోలా, సౌజన్య తెలిపారు. ఏరోబిక్ రైస్ పర్యావరణ అనుకూల బియ్యమని, ఈ వరి ఉత్పత్తి పద్ధతిలో మిథేన్ ఉద్గారం గణనీయంగా తగ్గుతుందన్నారు. నిలువ నీరు లేని కారణంగా తెగుళ్లు, వ్యాధులు సోకవని, తద్వారా పురుగుల మందుల వినియోగాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. దిగుబడిలో రాజీపడకుండా ప్రయోజనాలు అందించడం వల్ల వరిసాగు పద్ధతిలో ఏరోబిక్ రైస్ అత్యంత సరసమైనదని వారు తెలిపారు. నీటి కొరత ఉన్న వ్యవసాయ భూమిలో రైతులకు ఏరోబిక్ రైస్ ఒక వరమన్నారు. ఇతర బీడు భూమి పంటలు లాగానే భూమిని రెండుసార్లు దున్ని సాగు చేయాలని, నల్ల మట్టి మినహాయించి ఏరోబిక్ రైస్‌ను ఇతర రకాల మట్టిలో పెంచవచ్చన్నారు. ఏరోబిక్ రైస్ పద్ధతిలో బీడు భూమిలో ఉపయోగించే యంత్రాలు వాడవచ్చన్నారు. దీని వల్ల నేల ఆరోగ్యం, పోషణ గణనీయంగా ఉంటుందన్నారు. హెక్టార్‌కు నాలుగు నుండి ఆరు టన్నుల వరకు దిగుబడి లభిస్తుందన్నారు. సాంప్రదాయిక పెంపకం టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు బెంగళూరుకు చెందిన కిసాన్ క్రాఫ్ట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.