తెలంగాణ

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇఎన్‌సీ రవీందర్ రావు, సిఇలు ఆశారాణి, సతీష్ ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, రాష్ట్ర రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో గోదావరి నదిపై రెండు, మానేరు నదిపై ఒక వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించి అనుమతించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా రవాణా మంత్రిత్వ శాఖను ఒప్పించి రెండు వరుసల రహదారులుగా మార్పిడి చేయించిన విషయంపై కూడా చర్చించారు. సాధారణంగా కేంద్ర నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతాల్లో ఒక్క వరుస రహదారిని మాత్రమే ఏర్పాటు చేస్తారు, గత ప్రభుత్వ హయంలో కూడా కేంద్రం ఒక వరుస రహదారిని మంజూరు చేసింది.