తెలంగాణ

పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వమని, పేదల కష్టాలు చూసి చలించిన మోదీ దేశవ్యాప్తంగా 8 కోట్ల పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తన తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు చూసిన మోదీ , ఏ తల్లీ అలాంటి కష్టాలు పడకూడదనే ఉద్దేశ్యంతో ఉచిత గ్యాస్ ఇస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ సమీపంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని మోతీలాల్ నెహ్రూ నగర్‌లో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు లక్ష్మణ్ ప్రధానమంత్రి ఉజ్వల్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు గ్యాస్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం బీజేపీ మాత్రమేనని, పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న మోదీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వారి అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, కానీ తెలంగాణలో రేషన్‌కార్డులు లేని కుటుంబాలు చాలా మంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారికి రేషన్ కార్డులు ఇచ్చి ఆదుకోవడం లేదని విమర్శించారు. ఉజ్వల పథకంలో భాగంగా 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో పేద మహిళలకు 20లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం నిజంగా మోదీ మానవత్వానికి ప్రతీక అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 15వేల గ్రామాలు, పట్టణాల్లో అలాగే తెలంగాణలో 73 గ్రామాల్లో నిరుపేదలకు ఉచిత గ్యాస్ పంపిణీ జరుగుతోందని అన్నారు. మరుగు దొడ్లు లేని ఇళ్లు ఉండరాదనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ 12వేల రూపాయిలు ఆర్ధిక సాయం అందిస్తోందని అన్నారు. నరేంద్రమోదీ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కార్మికులు, కర్షకులు, మహిళలు, దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గ్యాస్ లేని పేదలను గుర్తించి, వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఏప్రిల్ 20వ తేదీన ఉజ్వల్ దివాస్‌గా పరిగణించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.