తెలంగాణ

ఎంఈసీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: మహేంద్ర ఎకోల్ సెంట్రల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండో- ఫ్రెంచ్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రతినిధి మల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. నాలుగు స్పెషలైజేషన్లలో 240 సీట్లు ఉన్నాయని, ఇతర వివరాలకు సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని, దరఖాస్తులను ముందుగా సమర్పించిన వారికి మే 31న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు. దరఖాస్తులు పంపేందుకు జూలై 7 వరకూ గడువు ఉందని తెలిపారు.
ఐఐఎంలో ఫ్యామిలీ బిజెనెస్ మేనేజిమెంట్ కోర్సు
ఐఐఎం, టీఎస్ డబ్ల్యు సంస్థలు కలిపి ఫ్యామిలీ బిజినెస్ మేనేజిమెంట్ కోర్సును ప్రారంభించాయి. భారతదేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న నూతన తరం మేనేజర్లకు అవగాహన కల్పించి వారికి సాధికారిత కల్పించడం కోసం ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు లెర్నింగ్ ప్రెసిడెండ్ అనీష్ శ్రీకృష్ణ, ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రఫుల్ల అగ్ని హోత్రి తెలిపారు. భారతదేశంలో వ్యాపారంలో పోటీతత్వం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను నిర్వహించడానికి పూనుకుంటున్న యువ వ్యవస్థాపకులను ప్రొఫెషనల్ వ్యాపారవేత్తలకు దీటుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు.