తెలంగాణ

కంటోనె్మంట్ ఏరియాలో రోడ్లు, ప్లై ఓవర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ప్లై ఓవర్ నిర్మించడానికి రెండు వారాల్లో ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కంటోనె్మంట్, రెవిన్యూ, మున్సిపల్, అధికారులతో సీఎస్ జోషి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, కంటోనె్మంట్ ప్రాంతంలో నిర్మించబోయే గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మించే రోడ్‌పై జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలను రూపొందించిందన్నారు. భూ సేకరణ, నిధులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ-ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, గఫ్ రోడ్‌ను సాధారణ ప్రజలు ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కారణంగానే పలుమార్లు గఫ్ రోడ్‌ను మూసి వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ రోడ్ నిర్మించాలని ఆయన సూచించారు. సిఎస్ జోషి జోక్యం చేసుకుంటూ రక్షణశాఖకు ఇబ్బంది కలుగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రత్యామ్నాయ రోడ్‌కు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. జవహర్ నగర్‌లో ఏర్పాటు చేయనున్న ఫైరింగ్ రేంజ్‌కు సంబంధించిన లే అవుట్‌ను భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి ఖరారు చేయాలని మేడ్చల్ కలక్టర్ ఎంవి రెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేడ్చల్ కలక్టర్ ఎంవి రెడ్డి, కంటోనె్మంట్ బోర్డు సిఈవో ఎస్‌విఆర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం..సెక్రటేరియట్‌లో అధికారులతో సమావేశమైన సీఎస్ జోషి