తెలంగాణ

తెలంగాణ - కేరళ మధ్య సంస్కృతి, సంప్రదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ-కేరళ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను పరస్పరం బదిలీ చేసుకుందామని ఇరు రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రులు నిర్ణయించారు. కేరళ రాష్ట్ర బలహీనవర్గాలు, గిరిజన, షెడ్యూలు కులాల సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి ఏకె బాలన్ శనివారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను కలిసి చర్చలు జరిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి చందూలాల్ ఆయనకు వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించి, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక మీదట రెండు రాష్ట్రాల మధ్య సంస్కృతి, సాంప్రదాయాలను బదిలీ చేసుకుందామని వారు నిర్ణయించారు.