తెలంగాణ

పాతబస్తీ అభివృద్ధిపై ప్రణాళిక రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: పాతబస్తీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా ఎస్‌కె జోషి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పాతబస్తీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై సిఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పాతబస్తీలో మంచి నీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రాతిపదికన నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, పైపు లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను తగిన ప్రణాళిక, డిపిఆర్ తయారు చేసేందుకు కన్సల్టెంట్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యిందని తెలిపారు. రూ.400 కోట్లతో సౌత్ మూసీలో సివరేజ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. పనులన్నీ సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వరద నీటికి సంబంధించి 10.89 కిలోమీటర్ల మేర నాలాను విస్తరించడానికి నిర్ణయించి, 5 కి.మీ పూర్తి అయ్యిందని, మరో నాలుగు కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాతబస్తీలో అవసరమైన చోట్ల సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు గాను భూ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డబీర్‌పురా, దారుల్‌షిఫా, మీరాలం, హఫీజ్‌బాబానగర్, చాంద్రాయణగుట్టలలో భూసేకరణ పనులు పరిశీలించాలని తెలిపారు. పాతబస్తీలో మెరుగైన ఆరోగ్యం కోసం 13చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగుచోట్ల ప్రారంభించామని, మిగిలిన చోట్ల కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.