తెలంగాణ

ప్రాజెక్టులతో అందరికీ మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఏప్రిల్ 23: తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుందని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 10జిల్లాలకు చెందిన మత్స్యకార్మిక సంఘాల నుండి ఎంపికైన సభ్యులను, పలువురు మత్స్యశాఖ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హైదరాబాద్ నుండి వారితో వెళ్తూ మార్గమధ్యంలో జనగామ పాలకేంద్రంలో కాసేపు ఆగివెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రెండు దఫాలుగా 74కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తే వాటి వల్ల మత్స్యకారులకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం 86కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే దానికి అనుసంధానంగా చేపట్టిన రిజర్వాయర్లలో నీరుచేరి మత్స్యసంపదను పెంపొందించేందుకు అవకాశం ఉందన్నారు. చేపల పెంపకంలో అనుసరించవల్సిన ఆధునిక పద్ధతులపై మత్స్యకారులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అదేకాక ఐఎఫ్‌డీఎస్ ద్వారా మత్స్యకార్మికులకు మంచి రాయితీ కల్పిస్తూ రుణసౌకర్యం అందచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్‌ల ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించేందుకు యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కొద్ది మాసాల్లోనే పూర్తికానుందని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని పలు రాష్ట్రాలు ప్రశంసిస్త్తున్నాయని అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తుంటే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రల పేరుతో గగ్గోలు పెడుతోందని విమర్శించారు. సుమారు 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, విజయడైరీ ఎండీ నిర్మల, గొర్రెల, మేకల కార్పొరేషన్ ఎండీ లక్ష్మారెడ్డి, డీఎఫ్‌వో శ్రీపతి, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడు చింతల యాదయ్య, నాయకులు సదానందం, ఇట్టబోయిన రమేశ్, బూర్ల యాదగిరి, సత్యనారాయణ పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్