తెలంగాణ

25న కాంగ్రెస్‌లో చేరనున్న నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 23: బీజేపీ సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది. బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకొని ఆ పార్టీ అధిష్టానంతోను, రాష్ట్ర సీనియర్ నాయకులతో చర్చలు జరపగా, ఆయన పార్టీలో చేరేందుకు నాగం రాజకీయ విరోధి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకులు ససేమిరా అంటూ పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి పార్టీలో చేరిన వారికే పార్టీ టికెట్ ఇవ్వాలని, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వవద్దంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో నాగం కాంగ్రెస్ పార్టీలో చేరడం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నాగం జనార్థన్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 25న న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహూల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు.