తెలంగాణ

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన అభివృద్దిపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పధకాలను చూసి ప్రజల్లో విశ్వాసం కోల్పోతామనే భయంతో విమర్శలు చేస్తున్న విపక్ష నాయకులకు దమ్ముంటే చర్చకు సిద్దం కావాలని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి చివ్వెంల మండలపరిధిలోని పాండ్యానాయక్‌తండాలో రూ.2కోట్లతో నిర్మించే సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమనేతగా రాష్ట్రం కోసం పోరాడిన సీఎం కేసీఆర్‌కు ప్రజల కష్టాలన్నీ తెలుసన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పధకాలను అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు హామీ ఇవ్వకుండానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు పెట్టుబడిసాయం లాంటి పధకాలను అమలు చేస్తూ దేశానికే కేసీఆర్ పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని అదేవిధంగా ప్రతి ఇంటికి స్వచ్చమైన మంచినీటిని అందించే మిషన్ భగీరధ పధకాన్ని సాహసోపేతంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 2018 నాటికి రాష్ట్రంలోని ప్రజలకు మంచినీటిని అందించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించిన దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులను గమనించి రైతును రాజుగా మార్చే లక్ష్యంతో రైతులకు పంట పెట్టుబడిసాయం పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలను మద్దతుధరకు అమ్ముకొని రైతులే ధరలను నిర్ణయించే వ్యవస్థను తీసుకువచ్చే లక్ష్యంతో రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, మార్కె ట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ కల్పగిరి యశోధ, జడ్పీటీసీ రౌతు చొక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.9కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు ఈసందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు.
చిత్రం..రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి