హైదరాబాద్

సహాయక చర్యల్లో వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: విపత్కర పరిస్థితుల్లో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాల్సిన జిహెచ్‌ఎంసి అధికారులు రాజకీయ వత్తిడికి తలొంచుతున్నారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే! గతంలో ఎన్నడూ లేని విధంగా పలు చోట్ల మహావృక్షాలు నేలకొరగటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అంతేగాక, విద్యుత్, కేబుల్ ప్రసారాలు కూడా నిల్చిపోవటంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో కనీసం కరెంటు సరఫరా ఎపుడు పునరుద్దరిస్తారో తెల్సుకునేందుకు, విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు చేసేందుకు ఫోన్లు చేసినా, అధికారులు స్పందించలేదని పలువురు వాపోతున్నారు. జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్ ఇతర శాఖల అధికారులు ఒక పార్టీకి చెందిన కార్పొరేటర్ల వత్తిడి మేరకే సహాయక చర్యలు జరిగాయని ఒక వర్గానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు.
అంతెందుకు పూర్వ మేయర్ ప్రాతినిధ్యం వహించిన అహ్మద్‌నగర్ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ అయేషా రుబీనా రాత్రంత అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఒక వర్గం ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు కరెంటు సరఫరాను పునరుద్దరించారే తప్పా, అదే డివిజన్‌లో మరో వర్గం ప్రజలు నివసించే ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు కూడా కరెంటు సరఫరాను పునరుద్దరించలేదు. అంతేగాక, జేఏబిలు, సెంట్రల్ ఎమర్జెన్సీ వాహానాలు, రోడ్లపై ఒరిగిన చెట్లను కట్ చేసే కట్టర్లు ముందుగా తమ ఏరియాలకు పంపాలని ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అధికారులపై తీవ్ర స్థాయిలో వత్తిడి తేవటంతో గత్యంతరం లేక పలు డివిజన్లలో అధికారులు వారు చెప్పిన ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టి, తమ పనైపోయిందనుకుని వెళ్లిపోయారు.
ఈ రకంగా సహాయక చర్యలు ఎక్కువగా ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి, గోల్కొండ, బంజారాహిల్స్, ముషీరాబాద్ ప్రాంతాల్లో జరిగినట్లు ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపించారు. అదే అధికారుల సెల్‌ఫోన్లకు రాత్రంత సామాన్య ప్రజల నుంచి వందల సంఖ్యలో కాల్స్ వచ్చినా, ఒక్కదానికి కూడా సమాధానమివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. అర్థరాత్రి చేసేదేమీ లేక శనివారం ఏరియాలో తిరిగి అధికారులను కలిసి ప్రశ్నిస్తే, తాము క్షేత్ర స్థాయి పనుల్లోనే ఉన్నామని, ప్రజాప్రతినిధులంతా ప్రాణం మీదు కూర్చోని పనులు చేయించుకుంటే మేం చేసేందేముంది? అంటూ సమాధానమిచ్చినట్లు వాపోయారు. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్‌లోని మినిష్టర్ క్వార్టర్స్ వైపు వెళ్లే దారిలో తెల్లవారుఝాము వరకు రోడ్డుకిరువైపులా విరిగిపడిన చెట్లు దర్శనమిచ్చినా, అంధకారం నెలకొన్నా, పట్టించుకునే నాధుడే కరవయ్యాడు.