తెలంగాణ

ఫోన్ డబ్బులను విరాళంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: సామాజిక మాధ్యమాల వల్ల చెడు మాత్రమే కాదు మంచి కూడా జరుగుతుందని నిరూపించే ఉదంతం ఇది. ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సాధారణ పౌరుల సమస్యలపై స్పందించడం తెలిసిందే. ఇదే తరహాలో ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల కలిగే ప్రయోజనాలు, అపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏ విధంగా దోహదం చేస్తుందో మంత్రి కేటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. ఈ ట్విట్టర్‌పై పదవ తరగతి విద్యార్థి ఒకరు స్పందించి మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన ఇచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని తిరిగి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటిఆర్ వెల్లడించారు. ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదవి తరగతి చదవుతున్న విశ్వత్ అనే విద్యార్థి, మంత్రి కేటిఆర్ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నారు. ‘గత 46 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షా 20 వేల కుటుంబాలు లబ్థిపొందాయి. సుమారు రూ. 800 కోట్లను ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. అపదలో, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయవచ్చు’ అని మంత్రి కేటిఆర్ ఇటీవల ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. దీనిని ఫాలో అవుతున్న విశృత్ స్పందిస్తూ‘ రామ్ అంకుల్ ప్రజలకు చేస్తున్న సహాయం చూసాక ఫోన్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన డబ్బులతో పాటు దాచుకున్న ప్యాకేట్ మనీ కలిపి సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేలు ఇస్తున్నాను. అపదలో ఉన్న వారి లో ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు’ అని ట్విట్ చేసారు. సిఎం రిలీఫ్ ఫండ్ అంటూ ఒకటి ఉంటుందనే విషయమే తనకు తెలియదని, మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ద్వారానే తెలిసిందని విశృత్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటిఆర్ విశృత్‌ను పిలుపించుకుని అభినందించారు. విశృత్‌ను స్ఫూర్తిగా తీసుకొని విరాళాలు ఇచ్చే వారు ముందుకు రావాల్సిందిగా కేటిఆర్ పిలుపునిచ్చారు.

చిత్రం..ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50వేల చెక్కును
మంత్రి కేటీఆర్‌కు అందజేస్తున్న ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి విశ్వత్