తెలంగాణ

అటవీ భూముల ఆక్రమణలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: అటవీ భూముల ఆక్రమణలను అరికట్టాలని, మరింత సమర్థవంతంగా హరితహారం అమలు చేయాలని, నర్సరీల నాణ్యత పెంచాలని అటవీ శాఖ సదస్సులో ఉన్నతాధికారులు నిర్ణయించారు. దూలపల్లిలోని అటవీ అకాడమీలో మూడు రోజులుగా వర్క్‌షాప్ జరిగింది. బుధవారం చివరి రోజున జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, హరితహారం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ పికే ఝూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తమ శాఖ చేపట్టిన పనులను సర్కిల్ వారీగా వివరించారు. అనంతరం నర్సింగ్‌రావు ప్రసంగిస్తూ అభివృద్ధి, పర్యావరణ సమతుల్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలనీ చెప్పారు. రానున్న తరాలకు మంచి జీవన ప్రమాణాలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అటవీ శాఖకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. ఇలాఉండగా ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో పలు అంశాలపై అధికారులు చర్చించారు. అడవుల్లో వేట నియంత్రణ, కఠిన చర్యలు, వేసవిలో అటవీ జంతువులకు నీటి సౌకర్యం, అర్బన్ ఫారెస్టు పార్క్‌ల గుర్తింపు, అభివృద్ధి, ఇతర శాఖలతో సమన్వయంపై చర్చించారు.