తెలంగాణ

బీజేపీ రాష్ట్ర కమిటీలో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీజేపీలో మరో కీలక నేత నాగం జనార్ధనరెడ్డి అతని బృందం బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నాగం జనార్థనరెడ్డి బీజేపీని వీడి వెళ్లిపోతారనే ప్రచారం గత ఏడాది నుండి జరుగుతున్నా, ఆయనను పార్టీలో కొనసాగేలా ఆపడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే భావన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. బీజేపీ చాలా గట్టి నాయకులు వందల్లో ఉన్నా వారిని సమన్వయ పరుస్తూ, ఎప్పటికపుడు వారి ఆలోచనలను , అభిప్రాయాలను తెలుసుకుంటూ వారికి సైతం మాట్లాడే అవకాశం కల్పించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావనే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొత్తగా పార్టీలో చేరుతున్న నేతల వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఎంతో కొంత ఉన్నా, వెళ్లిపోతున్న వారి వల్ల పార్టీకి జరిగే నష్టం ఎక్కువగా ఉందనే భావన వ్యక్తమవుతోంది. నాగర్‌కర్నూలు నుండి ఐదుమార్లు గెలవడమేగాక, 1983 నుండి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నాగం జనార్థనరెడ్డిని 2013 జూన్ 3వ తేదీన ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీలోకి స్వాగతం పలికారు. వేలాది మందితో ఏర్పాటైన ఆ బహిరంగ సభ చూడటానికి పార్టీలో చేరే వారి కోసం కాకుండా ఎన్నికల సభ మాదిరి అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు అంతా నాగం చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన చాలా మంది సివిల్ సర్వీసు అధికారులు, సినీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సంఘసేవలకుల మాదిరి వౌనం పాటించకుండా పార్టీ కార్యాలయానికి రోజూ వస్తూ, దైనందిన రాజకీయ అంశాలపై తీవ్రంగానే స్పందించడంతో పార్టీ ఒక దశలో ఇరకాటంలో పడిపోయింది. టిఆర్‌ఎస్‌తో పొత్తు భవితవ్యం ఎలా ఉండబోతుందో తెలియని అయోమయంలో పార్టీ నేతలున్న సమయంలో నాగం జనార్ధనరెడ్డి టీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయడంతో పాటు ఎప్పటికపుడు విలేకరులకు అందుకు సంబంధించిన పత్రాలను కూడా విడుదల చేశారు. మరీ ముఖ్యంగా మిషన్ భగీరథ కార్యక్రమంలో లోటుపాట్లను ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై తొలుత ఆచితూచి వ్యవహరించే వైఖరిని పాటించిన నాయకులు నాగం జనార్ధనరెడ్డిని సైతం వారించే ప్రయత్నం చేయడంతో తనదైన శైలిలోనే పయనిస్తానని, కుదిరితే తన బాటలోనే రాష్ట్ర నాయకత్వం టీఆర్‌ఎస్ పాలనలో అవినీతిపై పోరుసాగించాలని హితవుపలికారు. దాంతో రాష్ట్ర నాయకత్వానికి, నాగం బృందానికి మధ్య ఎడం పెరిగింది. రాష్ట్ర కార్యాలయానికి తర్వాతర్వాత రావడం తగ్గించిన నాగం జిల్లాలోనే విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ను నిలదీయడం మొదలుపెట్టారు. ఒక దశలో నాగం వైఖరిని నిరసిస్తూ కొంత మంది నేతలు కేంద్ర పార్టీకి ఫిర్యాదు కూడా చేశారు. దానిపై ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత పార్టీలో కొనసాగడం సాధ్యం అయ్యేలా లేదని గమనించిన నాగం కాంగ్రెస్‌లో చేరికపై తన ఆసక్తిని వెల్లడించడంతో పార్టీ నేతలు వెంటనే స్పందించారు.
ఆయన వేరే పార్టీలో చేరినా బీజేపీకి వచ్చే నష్టం లేదని స్పష్టం చేశారు. అంత నష్టం లేని వ్యక్తిని పార్టీలోకి అంత ఘనంగా ఎందుకు స్వాగతం పలికారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే పార్టీ పటిష్టంగా ఉన్న సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో నాగం ప్రభావం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే టిక్కెట్ల వేటలో తనకు, తన కుమారుడికి సీట్లు దక్కే అవకాశం లేకనే ఆయన బీజేపీని వీడారని, ఆయన పార్టీ మారడం వల్ల బీజేపీకి ఇబ్బంది ఏమీ ఉండబోదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.