తెలంగాణ

సిద్దిపేట మార్కెట్ యార్డు రాష్ట్రానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 25 : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్పెషల్ గ్రెడ్ మార్కెట్ కమిటీకి అన్ని వౌలిక సదుపాయాలతో పాటు, రైతులకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విశేషమైన సేవలు అందించినందుకు ఐఎస్‌ఓ 9001, 2015 పురస్కారాన్ని అందుకుంది. ఐఎస్‌ఓ ప్రతినిధి శివయ్య, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ఐఎస్‌ఓ సర్ట్ఫికెట్‌ను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల వెంకట్‌రెడ్డికి ప్రదానం చేశారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఐఎస్‌ఓ 9001 పురస్కారాన్ని అందుకున్న తొలి మార్కెట్ కమిటీగా సిద్దిపేట స్పెషల్ గ్రెడ్ మార్కెట్ కమిటీ గుర్తింపు పొందింది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో అన్నదాతలకు అన్ని వౌలిక సదుపాయాలు, విశాలమైన షెడ్‌లు, 35 మెట్రిక్ వేల టన్నుల గోడౌన్లు, టార్పాలిన్ కవర్లు, ఫ్యాడీ క్లీనర్లు, విశ్రాంతి భవనం, టాయలెట్స్, స్వచ్ఛమైన తాగునీరు, ఐదు రూ. నాణ్యమైన భోజనం, సీసీ రోడ్లు, క్యాంటీన్ తదితర సదుపాయాలు కల్పించారు. 15వేలకు పైగా చెట్లు నాటడంతో పాటు పరిరక్షించారు. ఐఎస్‌ఓ ప్రతినిధులు మార్కెట్ యార్డును పరిశీలించి అన్ని సేవలను పరిశీలించి ఐఎస్‌ఓ 9001, 2015 సిఫారసు చేశారు. యుకే ప్రతినిధులు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత సిద్దిపేటకు ఐఎస్‌ఓ 9001, 2015 సర్ట్ఫికెట్‌ను జారీచేశారు. సిద్దిపేట మార్కెట్ యార్డు ఐఎస్‌ఓ సర్ట్ఫికెట్‌ను బుధవారం సిద్దిపేట మార్కెట్‌యార్డులో ఐఎస్‌ఓ ప్రతినిధి శివయ్య, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా మార్కెట్‌కమిటీ చైర్మన్ వేముల వెంకట్‌రెడ్డికి అందచేశారు.