తెలంగాణ

సింగరేణి కార్మికుల సమస్యలపై సీఎండీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: సింగరేణి ఏరియాలో పని చేస్తున్న కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సమస్యలపై మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో సంస్థ సీఎండీ శ్రీధర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. 36వ చైర్మన్ స్థాయి స్ట్రక్చర్డ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక యూనియన్లు సూచించిన సమస్యలపై సుధీర్ఘంగా చర్చంచినట్లు సంస్థ పౌరసంబంధాల అధికారి మెహేశ్ తెలిపారు. కార్మికులకు మేలు జరిగేవిధంగా చర్యలు తీసుకున్నట్ల చెప్పారు. సమీక్షించిన అంశాలను అమలు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్మికులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లులపై చర్చించారు. సింగరేణితో పాటు కోలిండియాలో అమలులో ఉన్న క్యాడర్ స్కీంను అధ్యయనం చేయడానికి కమిటి ఏర్పా టు చేసినట్లు చెప్పారు. గైర్హాజరుతో తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని యూనియన్లు చేసిన ప్రతిపాదనపై లోతు గా చర్చలు జరిగాయి. గైర్హాజరు కార్మికులను ఉపేక్షించడం, సమర్థించడం తగదని ఆయన స్పష్టం చేసినట్లు చెప్పారు. కంపెనీ స్థలాల్లో కార్మికులు నిర్మంచుకున్న ఇళ్ళ పట్టాల గురించి స్థానిక కలెక్టర్లతో చర్చలు జరుపుతామన్నారు. సింగరేణి సంస్థ లీజుకు తీసుకున్న భూములను కార్మికులకు రాసి ఇచ్చే అవకాశం లేదని సంస్థ ప్రకటించింది. సంస్థ యాజమాన్యంతో పాటు కార్మికులు సఖ్యతతో ముందు కు వెళ్ళితే సంస్థ ప్రగతిని సాధిస్తుందని సీఎండీ సూచించారన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లలో కొత్త బ్లాకులు తీసుకొని దాదాపు 100 మిలియన్ల టన్నుల వార్శిక ఉత్పత్తి స్థాయికి చేరుకోవాలని సూచించినట్లు సీఎండీ తెలిపినట్లు మహేశ్ తెలిపారు.

చిత్రం..సమీక్షలో మాట్లాడుతున్న సీఎండీ శ్రీధర్