తెలంగాణ

బియ్యం దారిమళ్లితే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: పౌరసరఫరాల శాఖకు చెందిన ఒక్క బియ్యం గింజ దారిమళ్లినా ఉపేక్షించేది లేదని ఆ శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ హెచ్చరించారు. పేదలకు పెట్టెడన్నం పెట్టాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల సబ్సిడీతో అందిస్తున్న బియ్యం వంద శాతం అర్హులకే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు వ్యాపారులతో అంటకాగుతున్న అధికారులను వదలబోమన్నారు. ఈనెల 11న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మంలంలో అక్రమంగా తరలిపోతున్న నాలుగు లా రీల బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకు9న్నారు. దీనిపై మరింత లోతైన విచారణ జరపగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ధాన్యం కేటాయింపులు జరిపినట్టు తెలింది. దీం తో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ ఇందుకు బాధ్యులైన డీసిఎస్‌ఓ ఏ. ఉషారాణినిపై బదిలీ వేటు వేయడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఎంఎ నవాజ్, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అన్వరుల్లాఖాన్‌ను రెవెన్యూశాఖకు సరెండర్ చేశారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ క్రింద కేసు లు నమోదు చేస్తామని హెచ్చరించా రు. ఆకాల వర్షాల నేపథ్యంలో మం గళవారం కమిషనర్ కరీంనగర్, వంరగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పౌరసరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష-సమావేశం నిర్వహించారు. పేదల కోసం పం పిణీ చేసే బియ్యాన్ని వారికే అందే లా అధికారులంతా చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు.