తెలంగాణ

ఇసుక టెండర్లు ఎవరికీ అప్పగించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: సింగరేణి సంస్థ ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ పనిని అర్హతలేని కంపెనీకి అప్పగించారని ఇటీవల కొందరు పత్రికల ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న విషయాలపై సింగరేణి యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రకటనల్ని నమ్మవద్దని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇసుక తయారీ కోసం టెండర్లును పిలిచింది వాస్తవమేనని అయితే వచ్చిన ఐదు టెండర్లలో ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉందన్నారు. ఒక టెండరు మాత్రమే వచ్చినందన మళ్ళీ టెండర్లు పిలవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపింది. ఇసుక తయారీ టెండరు అప్పగించడంలో అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. సింగరేణి భూగర్భగనుల్లో బొగ్గు తవ్వకం తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను నింపడానికి సమీప నదుల్లోని ఇసుకను వాడుతున్నట్లు వివరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున ఇసుక లభ్యత తగ్గుతుందని అందుకు ముందు జాగ్రతగా ఇసుకను డంపింగ్ చేయడానికి సంస్థ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపింది. పర్యావరణహిత చర్యగాసంస్థఓపెన్ కాస్టుల ఓవర్ బర్డెన్ ( మట్టి వంటి పదార్థం) నుంచి తీసే ఇసుకను శాండ్ స్టోయింగ్‌కి వాడుతోందని సంస్థ తెలిపింది. అలాగే సివిల్ పనులకు కూడా వినియోగించే విధంగా ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ చేయాలని సంస్థ యోచిస్తోందని వివరించింది. దేశవ్యాప్తంగా పేరున్న కంపెనీలను ఇసుక తయారీకి ఆహ్వానించినట్లు తెలిపింది. టెండర్లు దక్కించున్న కంపెనీలు సింగరేణి ప్రాంతంలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ట్రయల్న్‌త్రో ఇసుక తయారీ చూపించాల్సి ఉంటుందని, అలా చూపించిన కంపెనీకే అనుమతి ఇస్తామని సంస్థ తెలిపింది. సంస్థ ప్రతిపాదనకు కేవలం ఒక్క కంపెనీ (అహోమ్ కన్సల్టెంట్) మాత్రమే ముందుకు వచ్చినట్లు పేర్కొంది. గోదావరిఖనిలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇసుక తయారీని సంబంధిత కంపెనీ చూపించిందని గుర్తు చేసింది. జెఎన్‌టియు వారి ఆధ్వర్యంలో ప్రమాణాలను పర్యవేక్షించిందని అందుక సదరు కంపెనీ పేరును సంస్థ చూచించినట్లు తెలిపింది. ఒక్క కంపెనీ మాత్రమే అర్హత సాధించినందున ఆకంపెనీ టెండరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి టెండర్లను పిలువాలని బోర్డు సూచించింది. బోర్డు సూచనలతో మరోసారి టెండర్లు పిలువనున్నట్లు సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ తెలిపారు.