తెలంగాణ

ఎత్తివేతకు ఏడాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ప్రజా ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పడానికి నిదర్శనమే ధర్నాచౌక్ ఎత్తివేత అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ధర్నాచౌక్ ఎత్తివేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజా గొంతుక ధర్నాచౌక్ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, రమ మేల్కోటే, సీపీ ఎం నాయకులు డీజీ నర్సింగరావు, అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు. ధర్నాచౌక్ ఎత్తివేసిన అనంతరం పలువురు రచించిన వ్యాసాల ఆధారంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ కష్టాలను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేసే అవకాశాన్ని సైతం ఇవ్వకుండా అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడం విచారకరమని అన్నారు. ఎప్పటికీ అధికారంలో ఉంటామన్న భ్రమను వీడాలన్నారు.

చిత్రం..ప్రెస్‌క్లబ్‌లో ప్రజా గొంతుక ధర్నా చౌక్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చాడ వెంకటరెడ్డి,
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, ప్రొ. హరగోపాల్ తదితరులు