తెలంగాణ

మార్పు కోసం ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకుండా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, టీఆర్‌ఎస్‌లు బీజేపీ వ్యతిరేకంగా ఎన్ని కుయుక్తులు రచించినా బీజేపీ విజయాన్ని ఆపలేకపో యారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మ ణ్ అన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి కన్నడ ప్రజలు పట్టం కట్టారన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ఫలితాలు పునరావృ తమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో బీజేపీ గెలుపు ప్రధాని మోదీ విజయమని బీజేపీ శ్రేణులు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించడంతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నేతలు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచిపెట్టి బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నా రు. నాలుగేళ్ల అవినీతి రహిత పాలన, పేదల కోసం ప్రధాని ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతోనే కర్నాటక ప్రజలు బీజేపీకి పట్టం కొట్టారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కొంతమంది నేతలను కర్నాటకకు పంపించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారని, కానీ కన్నడనాట తెలుగు ప్రజలు బీజేపీకి బాసటగా నిలిచారని పునరుద్ఘటించారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ పార్టీలకు అతీతంగా ప్రజలు మోదీ పా లన పట్ల ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఇంత వరకూ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలోనూ బీజేపీ విజయపథంవైపు దూసుకువెళ్లడం ఖాయమని ఆ శాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా వంటిదని, టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టి, తెలంగాణాలోనూ విజయబావుటా ఎగురవేసేందుకు పార్టీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తుందన్నారు. కన్నడ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని పార్టీ నిలబెట్టుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాని అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లు వేశారని జి కిషన్‌రెడ్డి చెప్పారు.

చిత్రాలు..బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డికి మిఠాయ తినిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,
*పార్టీ కార్యాలయం బయట మహిళా కార్యకర్తల సంబురాలు