తెలంగాణ

తెలంగాణలో ఉన్నత విద్యా సౌరభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్శిటీలు రానున్న రోజుల్లో వరల్డ్ ర్యాంకింగ్స్‌కు పోటీపడటం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా చర్యలు చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే గురువారం నాడు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అకడమిక్ డైరెక్టర్లు, అడ్మినిస్ట్రేటర్లతో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ - వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్, సౌత్ ఏషియా రీజనల్ డైరెక్టర్ రితిన్ మల్హొత్ర, లీడ్ హెడ్ నికీ హార్సమన్, ఆసియా జీఎం జస్టిస్ టే లు పాల్గొని వరల్డ్ ర్యాంకింగ్స్ తీరుతెన్నులు, ప్రామాణిక నిబంధలు, పారామితులు, యూనివర్శిటీలు అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలను చెప్పారు.
గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లు ఉన్నత విద్యారంగం విస్తరణ అంశాలపై మాట్లాడారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ లింబాద్రి, యుఎస్ కాన్సులేట్ చీఫ్ ఆఫ్ కాన్సులర్ సెక్షన్ డొనాల్డ్ ములిగన్ తదితరులు మాట్లాడారు. బోధన, పరిశోధన, నిధుల సమీకరణలో అనుసరించాల్సిన విధానాలను కూడా వారు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన యూనివర్శిటీలు ర్యాంకింగ్స్‌లో గట్టి పోటీ ఇస్తుండగా, భారతీయ వర్శిటీలు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యూనివర్శిటీలు పోటీ ఇవ్వడం లేదని, దీనికి కారణం అవసరమైన మెథడాలజీని అనుసరించకపోవడమేనని వారు చెప్పారు.