తెలంగాణ

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. కర్నాటక పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం రాజ్యాగం విరుద్ధమన్నారు. అప్రజాస్వామిక విధానాలతో అడ్డదారిలో గద్దెనెక్కాలని చూడటం సిగ్గుచేటన్నారు. కర్నాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వంద కోట్లతో తమ ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చారని జేడీఎస్ నేత కుమారస్వామి అనడం ప్రజాస్వామ్యం ఏ మేరకు ప్రమాదంలో పడిందో తెలియజేస్తోందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దేశంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని జానా రెడ్డి అన్నారు. గోవా, మేఘాలయ, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయా రాష్ట్రాల గరవ్నర్‌ల ద్వారా కాంగ్రెస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుపడ్డ వారే కర్ణాటక విషయంలో అత్యధిక స్థానాలు అంటూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం నిచమైన చర్య అన్నారు. ఈ తరహా ద్వంద వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు.