తెలంగాణ

21న హైదరాబాద్‌లో రష్యా ఎడ్యుకేషన్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రష్యా దేశంలో మెడికల్ కోర్సులో ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్న అవకాశాలపై హైదరాబాద్‌లో 21న సదస్సు నిర్వహిస్తున్నట్టు రష్యా ఫెడరల్ కాన్సులేట్‌లో వైస్ కాన్సులేట్ మైఖల్ జె గోర్బచెవ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని హోటల్ మారియట్‌లో నిర్వహిస్తామని బ్యాచిలర్స్/పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అభ్యసించాలనుకునే వారు తమ అర్హతకు తగిన పత్రాలను సమర్పిస్తే వెంటనే స్పాట్ అడ్మిషన్ ఇస్తామని అన్నారు. ఇతర దేశాల్లో ఉన్నట్టు రష్యా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి పరీక్షలు ఏమీ ఉండవని, అయితే మెడికల్ విద్యలో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం భారతదేశంలో కాకుండా మరే ఇతర దేశంలోని సంస్థలో అయినా మెడిసిన్ విద్య అభ్యసించడానికి ఎంసిఐ నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం ఎన్‌ఇఐటి పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. 2018 సంవత్సరానికి గానూ విదేశీ మెడిసిన్ కోర్సులో చేరి ప్రస్తుతం భాష/ సన్నాహక ఫౌండేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్ధులకు ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణిస్తూ నీట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా వారికి మినహాయించడం జరిగిందని అన్నారు.
టీజీటీ పోస్టులకు మరికొంతమందికి అవకాశం
టీజీటీ సైన్స్ పోస్టులకు మరికొంత మందికి అవకాశం కల్పిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ గురువారం నాడు పేర్కొంది. సైన్స్ టీజీటీ పోస్టులకు సంబంధించి 37 పోస్టుల ఖాళీలు ఏర్పడుతున్న దృష్ట్యా 74 మందిని మూడోదశలో సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఆహ్వానిస్తున్నట్టు కమిషన్ తెలిపింది. వారందరికీ ఈ నెల 22న ఉదయం 10 గం నుండి మధ్యాహ్నం 12.30 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో 24 మంది డిబార్
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో గురువారం నాడు 24 మందిని డిబార్ చేశారు. ఫస్టియర్ పరీక్షల్లో 1,39,257 మందికి గానూ 1,31,189 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షల్లో 49,422 మందికి గానూ 46555 మంది హాజరయ్యారు. ఉదయం పరీక్షల్లో 12 మందిని, సాయంత్రం జరిగిన సెకండియర్ పరీక్షల్లో 12 మందిని మాల్‌ప్రాక్టీస్ కేసులతో డిబార్ చేశారు.
ఓపెన్ వర్శిటీ పీహెచ్‌డీకి నోటిఫికేషన్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పిహెచ్‌డి, ఎంఫిల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, బిజినెస్ మేనేజిమెంట్, కామర్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, లైబ్రరీ సైన్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీల్లో అడ్మిషన్లు చేస్తారు. జూలై 29న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఉదయం 10 నుం డి 12 వరకూ, ఎంఫిల్‌కు మధ్యాహ్నం 2 నుండి 4 వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
పాలిసెట్‌కు 24,238 మంది
తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు జరుగుతున్న కౌనె్సలింగ్‌లో గురువారం నాటికి 66వేల ర్యాంకుల వరకూ పిలవగా, 24,238 మంది మాత్రమే కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు.