తెలంగాణ

ఐసిఏఆర్, ఐఐఆర్‌ఆర్ సైంటిస్టులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ప్రతిష్ఠాకరమైన బయోటెక్ ఉత్పత్తి, ప్రాసెస్ అభివృద్ధి వాణిజ్యపరమైన అవార్డును సిఎస్‌ఐఆర్-సిసిఎంబి, ఐసిఏఆర్-ఐఐఆర్‌ఆర్ సంస్ధల శాస్తవ్రేత్తలకు లభించాయి. ఈ అవార్డులను డాక్టర్ రమేష్ వి సొంఠి, డాక్టర్ రమణ్ మీనాక్షి సుందరం లకు లభించింది. సాంబమసూరి వంగడాన్ని అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు లభించింది. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. సాంబమసూరికి బిపిటి 5204 అనే పేరు కూడా ఉంది. ఈ బ్రాండ్ వరి వంగడం పాపులర్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడాన్ని బాక్టీరియల్ బ్లైట్ వ్యాధి సోకింది. దీని నివారణకు సిసిఎంబి, ఐఐఆర్‌ఆర్ శాస్తవ్రేత్తలు ఉమ్మడిగా చేసిన పరిశోధనలు ఫలించాయి.