తెలంగాణ

సమగ్ర సర్వేలో బీసీ జనాభాను పరిగనలోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు అవసరమైన బిసి లెక్కలను గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే గణనను పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌ను కోరారు. కొత్తగా ఇంటింటికీ తిరిగి బిసి జనాభా లెక్కలు సేకరించడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. బిసి జనాభా ఆధారంగా 34 శాతం బిసి రిజర్వేషన్లు పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిసిలకు కేటాయించాలని ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఇంతేకాకుండా బిసిల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కృష్ణయ్య కోరారు. గత సమగ్ర సర్వేలో తెలంగాణలో బిసిల జనాభా 52 శాతం ఉందని తేలినందున ఆ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.