తెలంగాణ

సింగరేణిపై పాటల సీడీలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం వంటి కార్యక్రమాలపై ప్రజలకు చేరువుకావడానికి సింగరేణి సంస్థ వినూత్న పద్దతిలో పాటలతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సంస్థ ముఖ్య పౌరసంబంధాల అధికారి జనగాం నాగయ్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో పాటల సిడీలను ఆయన ఆవిష్కరించారు. ఈ పాటలను ప్రముఖ రచయుత శ్రీ‘కందికొండ’ రాసిన గీతాన్ని సినీ నేపథ్యగాయకుడు బోలేషావలి స్వరపరచినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థపై రూపొందించిన గీతంలో సింగరేణి గొప్పతనాన్ని, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడిన విధానాన్ని తెలంగాణా ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సాధించిన ప్రగతి, దేశంలో నంబర్- 1 గా రూపుదిద్దుకున్న వివరాలను పాటల్లో పొందుపర్చినట్ల చెప్పారు. త్వరలో యూటూబ్ చానల్‌ను సంస్థ ప్రారంభిచనున్నట్లు ఆయన తెలిపారు. యూటూబ్ చానల్‌లో సింగరేణి సంస్థ సాధిస్తున్న ప్రగతితో పాటు సాంస్క్రతిక కళారూపాలను ప్రసారం చేయనున్నామని చెప్పారు. జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి అన్ని ఏరియాల్లో నిర్వహించే కార్యక్రమంలో ఈ పాటల గీతానికి నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. పాటల సీడీని జనరల్ మేనేజర్ ఆంథోనీరాజు మొదటి సీడీని సింగరేణి కార్మికుడు, ప్రముఖ ప్రజాకవి జయరాజుకు అందచేశారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్( ఫైనాన్స్) వెంకటరమణ (ఐటి) గీతామోహన్ ప్రాజెక్టు మేనేజర్ (ఈఆర్‌పి) సత్యనారాయణతో పాటు సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.

చిత్రం..సింగరేణి భవనంలో శ్రీ కందికొండ రాసిన పాటల సీడీలను ఆవిష్కరిస్తున్న అధికారులు