తెలంగాణ

కర్నాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: కర్నాటకలో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తూ లేఖ పంపించారు. హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో జరిగిన బస్సు యాత్రలో ప్రసంగిస్తూ బిజెపి ఆగడాలపై విరుచుకుపడ్డారు. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. ఇలాఉండగా సాయంత్రం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్‌సి కుంతియా మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్, జెడిఎస్‌కు 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ ఇచ్చినా గవర్నర్ బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. టిఆర్‌ఎస్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించిందని అన్నారు. దీనిపై న్యాయ స్థానాన్ని సంప్రదించగా, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేస్తూ ఆ వారిని యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించినా అమలు చేయడం లేదని కుంతియా విమర్శించారు. సిఎల్‌పి నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల్లో మెజారిటీ రాని బిజెపికి అధికారం అప్పగించడం అప్రజాస్వామికమని విమర్శించారు.
ఈ అంశంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు. కర్నాటక గవర్నర్ వ్యవహారించిన తీరుపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన చెప్పారు. రాష్టప్రతికీ ఫిర్యాదు చేస్తూ లేఖ పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంకా కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు జె. గీతారెడ్డి, డికె అరుణ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..హైదరాబాద్ గన్‌పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న టీ కాంగ్రెస్ నేతలు