తెలంగాణ

రైతులను ఆదుకోవడమే కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, మే 18: రైతులను గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు అన్ని రంగాల్లో చిన్నచూపు చూడటంతో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య పాల్పడవద్దనే సదుద్దేశంతో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి రైతులను కన్న బిడ్డలా చూసుకుంటున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు. ముంగింపు రోజైన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటరావుపేటలో చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉండటమే సీఎం లక్ష్యమని తెలిపారు. రైతుల కోసం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోని రారాజులాగా బతలకాలన్నారు. అనంతరం ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు తోబుట్టువుగా మారారని ఈ రైతుబంధు పథకం వల్ల రైతులంతా ఎంత సంతోషంగా ఉన్నారో తనకు తెలిసిందన్నారు. భూమి ఉండి కూడా డబ్బులు లేక పంట సాగు చేయలేని ప్రజలకు ఈ పథకం ఒక వరం అన్నారు.
రైతులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోని పంటల పండించి సహకరించాలని అన్నారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిప్యూటీ కలెక్టర్ శ్యామాల దేవి తదితరులు పాల్గొన్నారు.