తెలంగాణ

కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట రూరల్, మే 18: అధికారంలో ఉన్న సమయంలో రైతుల సమస్యలు పట్టించుకోకుండా నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంటే దిగజారి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం కార్యక్రమం చివరి రోజైన శుక్రవారం సూర్యాపేట మండలపరిధిలోని బాలెంల, కాసరబాద గ్రామాల్లో నిర్వహించన కార్యక్రమంలో పాల్గొని రైతులకు చెక్కులు, నూతన పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ రైతబంధుపై అవాకులు చెవాకులు పేలుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిలకు షాక్ ఇచ్చేందుకు యావత్ తెలంగాణా ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం రైతులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు చేస్తున కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కనుమరుగు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గతప్రభుత్వాలు రైతల గురించి పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా కరెంట్‌కోసం సబ్‌స్టేషన్‌ల మీద దాడులు జరగకుండా సరఫరా ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం క్యూలు కట్టి పోలీస్ పహరాలో లాఠీ దెబ్బలు తింటూ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పేరు చెప్పి నాలుగు ఎన్నికల్లో లబ్ధి పొందినా నేటికి ఆప్రాజెక్టును పూర్తిచేయకపోవడం వారి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసి రికార్డు సృష్టించామని అదేవిధంగా ఎలాంటి హమీలు ఇవ్వకపోయిన రైతులకు రుణమాఫీ, కళ్యాణలక్షి, కేసీఆర్ కిట్, విద్యార్థులకు సన్నబియ్యం లాంటి పథకాలను ప్రవేశపెట్టిన గొప్పదార్శనీకుడు సీఎం కేసీఆర్ ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నివారించి రైతులు పంటల పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితిని రూపుమాపే లక్ష్యంతోనే రైతుబంధు పథకానికి సీఎం కేసీ ఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు పాల్గొనగా.. బాలెంల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది పులగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.