తెలంగాణ

వ్యవసాయ శాస్తవ్రేత్త హంచిలాల్‌కు ప్రొఫెసర్ స్వామినాథన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: భారత్ వ్యవసాయ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సేవలను గుర్తించేందుకు ది ఐసిఏఆర్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాకరమైన అవార్డుకు వ్యవసాయ శాస్తవ్రేత్త డాక్టర్ ఆర్‌ఆర్ హంచిలాల్ ఎంపికయ్యారు. ఈ అవార్డును రెండేళ్లకోసారి వ్యవసాయ రంగానికి విశిష్టసేవలు అందించిన వారికి ప్రదానం చేస్తారు. వ్యవసాయం, చేపల పెంపకం, వ్యవసాయ ఇంజనీరింగ్‌లో విశేష పరిశోధనలు చేసి ఉత్పత్తి పెంచేందుకు కృషి చేసిన భారతీయ శాస్తవ్రేత్తలకు ఈ అవార్డులను బహూకరిస్తారు. ఈ అవార్డును హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన ప్రముఖ విత్తన సంస్ధ నూజివీడు సీడ్స్ స్పాన్సర్ చేస్తోంది. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు రెండు లక్షల రూపాయల నగదును బహుకరిస్తారు. అవార్డుకు ఎంపికైన డాక్టర్ హంచిలాల్ న్యూఢిల్లీలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.