తెలంగాణ

ముగిసిన రైతు బంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10 నుండి పండుగ వాతావరణంలో ప్రారంభమైన రైతు బంధు పథకం ఎలాంటి అపశ్రుతి లేకుండా, సజావుగా ముగిసిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు బంధు పథకం ముగింపు సందర్భంగా శుక్రవారం వరంగల్ నగరంలోని హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రైతు బంధు పథకం సాగిందని అన్నారు. రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు ఎక్కడికి వెళ్లిన ప్రజలు, రైతులు బ్రహ్మరథం పట్టి గ్రామాలకు స్వాగతించారని తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సర్కార్ చరిత్ర సృష్టించిందని అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, జూన్ 2నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏదైన రైతు ప్రమాదవశాత్తు చనిపోయినట్లైతే వారి కుటుంబాలకు ఐదు లక్షల బీమా పథకం వర్తిస్తుందని అన్నారు. రైతు బంధు పథకాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్టారు. దేశంలో మెజార్టీ రాష్టల్రలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతు అభివృద్ధి పథకాలు, రుణమాఫీ, పెట్టుబడి సాయం, 24గంటల విద్యుత్ సరఫరా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. పైగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేది కేంద్రమనే సంగతి మరిచిన ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ప్రతి పక్షాలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేవలం వారి ఉనికికోసమే విమర్శలు చేస్తున్నారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతు సంక్షేమం కోసం పాటు పడని సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉతమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమార ప్రగల్బాలు మాని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు స్వాగతించాలన్నారు. పథకంలో లోపాలు ఉంటే ఎత్తిచూపాలే తప్పా గుడ్డిగా విమర్శలు చేయవద్దని హితువుపలికారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి