తెలంగాణ

నలుగురు ఐపిఎస్ అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడ్రోజుల క్రితం దాదాపు 24 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నలుగురికి స్థాన చలనం కలిగించింది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న వై నాగిరెడ్డిని నార్త్‌జోన్ ఐజిగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. వరంగల్ రేంజ్ డిఐజిగా ఉన్న బి మల్లారెడ్డికి ఐజీగా పదన్నోతి కల్పిస్తూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. సిసిఎస్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న టి ప్రభాకర్‌రావు వరంగల్ రేంజ్ డిఐజిగా బదిలీ అయ్యారు. నార్త్‌జోన్ ఐజీగా ఉన్న నవీన్‌చంద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా నవీన్‌చంద్‌కు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.