తెలంగాణ

ఇక తెలంగాణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యే క దృష్టి సారించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ నగర శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి జేడీఎస్‌గా మారబోతున్నదని విమర్శించారు. కర్నాటక ముఖ్య మంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి టీఆర్‌ఎస్ వెళ్లాలని నిర్ణయించారం టే మీ అసలు రంగు ఏమిటో త్వరలో బ యటపడుతుందని ఆయన విమర్శించా రు. హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్, జేడీ ఎస్ ఎమ్మెల్యేలకు ఏర్పాట్లు చేసింది కూడా టీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు. కర్నాటకలో ఎన్నికలకు ముందు బీజేపీ- జేడీఎస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకు ని పోటీ చేస్తున్నట్లు విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జేడీఎస్‌కు ఎందుకు మద్దతునిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షకు సిద్ధమైతే ఆత్మప్రభోదానుసారంతో ఓట్లు వేద్దామంటే భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. కర్నాటకలో 150 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి న జేడీఎస్‌కు కాంగ్రెస్ అండగా నిలబడ డం విస్మయం కలిగిస్తున్నదన్నారు. రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ తోడుగా నిలవబోతున్నదని తెలిపారు. కుటుంబ పార్టీలన్నీ కలిసి ‘్ఫ్యమిలీ ఫ్రంట్’గా ఏర్పడనున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. దేశ ప్రజలం తా బీజేపీ వైపు ఉన్నారని ఆయన తెలిపా రు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వేల మంది చురుకైన కార్యకర్తలను తయా రు చేస్తే తాను అద్భుతం చేసి చూపిస్తాని చెప్పారు. వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌కు రా నున్నారని తెలిపారు. తెలంగాణలో అమి త్ షా విస్తృతంగా పర్యటించనున్నారని, కర్నాటక తరహా వ్యూహంతో పార్టీని ముం దుకు నడిపించనున్నారని ఆయన చెప్పా రు. కర్నాటకలో మూడు నెలల్లోనే షా అద్భుతం సృష్టించారని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకట రెడ్డి, ఇతర నాయకులు సుభాష్ చందర్ జీ, వీరేందర్ తదితరులు ప్రసంగించారు.